Anakapalli: ఏటీఎంలో రూ. 15లక్షలు చోరీ

by srinivas |
Anakapalli: ఏటీఎంలో రూ. 15లక్షలు చోరీ
X

దిశ, అనకాపల్లి: అనకాపల్లి పూడిమడక రోడ్‌లో ఉన్న ఎస్బీఐ ఏటిఎంలో దొంగలు చోరీకి పాల్పడిన ఘటన కలకలం రేపింది. నిత్యం రద్దీగా ఉండే పూడిమడక ఏటీఎంలోకి ప్రవేశించి దొంగలు గ్యాస్ కట్టర్ సహాయంతో చోరీకి పాల్పడ్డారు. ఏటీఎంలో ఉన్న సుమారు 15 లక్షల రూపాయలు నగదు దోచుకు వెళ్ళినట్లు అంచనా వేస్తున్నారు. ఆదివారం ఉదయం షట్టర్లు మూసి ఉండడంతో ఏటీఎం పనిచేయటం లేదని కస్టమర్స్ పెద్దగా పట్టించుకోలేదు.


అయితే ఏటీఎంలో లోపాలు ఉన్నా. సాంకేతిక సమస్య ఏర్పడినా బెంగళూరు ఎస్బిఐ కార్యాలయానికి సమాచారం అందుతుంది. దీని ద్వారా అనకాపల్లి బ్రాంచ్ ఎస్బీఐ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో సిబ్బంది ఎస్బీఐ ఏటీఎం వద్దకు చేరుకొని పరిశీలించారు. షట్టర్ ఓపెన్ చేసి చూశారు. ఏటీఎం మెషిన్ గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి ఉండడంతో చోరీ జరిగిందని గ్రహించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు క్లూస్ టీమ్‌తో సహా రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నారు. గతంలో కూడా ఇదే ఏటీఎంలో పట్టపగలు చోరీకి యత్నం చేసి విఫలమయ్యారు.

Advertisement

Next Story