- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
12 నుంచి ఏఐటీయూసీ జిల్లా మహా సభలు
by Javid Pasha |
X
దిశ, గాజువాక: విశాఖ నగరంలో ఈ నెల 12 నుంచి రెండు రోజుల పాటు ఏఐటీయూసీ జిల్లా మహా సభలు జరుగనున్నాయని విశాఖ జిల్లా ఏఐటీయూసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ తెలిపారు. పెద గంట్యాడ పోతిన సన్యాసిరావు భవన్ లో మంగళవారం ఏఐటీయూసీ జిల్లా మహాసభల గోడ పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం కసి రెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ.. ఏఐటీయూసీ ఆవిర్భవించి 103 సంవత్సరాలు అయ్యిందని, ఆనాటి నుంచి నేటి వరకు కార్మికుల పక్షాన రాజీలేని పోరు సాగిస్తోందని అన్నారు.
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ శక్తులకు కట్ట బెడుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పల్లేటీ పోలయ్య , జి.ఆనంద్ , కె.అచ్యుత రావు , పి.దుర్గారావు , సి.హెచ్.పెంటారావు, వై.దేముల్లు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story