Breaking News: విజయవాడ విలవిల.. వరదలో మంత్రులు

by srinivas |
Breaking News: విజయవాడ విలవిల.. వరదలో మంత్రులు
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ నగరం విలవిలలాడుతోంది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో వాగులు, వంకలు, కాలువలు పొంగిపొర్లాయి. బుడమేర వాగు ఒక్కసారిగా ఉప్పొంగింది. ఒక్కసారిగా విజయవాడ సిటీపై విరుచుకుపడింది. దీంతో టెంపుల్ సిటీ బస్తీలన్నీ జలమయం అయ్యాయి. నిన్న మొగల్రాజుపురం వాసులపై కొండ చరియలు విరుచుపడిన ఘటన మరువకముందే బుడమేర వాగు విజయవాడ సిటీ వరదల్లోకి నెట్టింది.


దీంతో సింగ్‌నగర్, చిట్టీనగర్, ఇలా చాలా కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎటు చూసినా బుడమేరు వాగు నీరే కనిపిస్తోంది. రోడ్లు 5 అడుగుల మేర నిలిచిపోయిన నీటితో చెరువులను తలపిస్తున్నాయి. ఊహించని రీతిలో విజయవాడ నగరాన్ని వరద నీరు కకావికలం చేసింది. ఎప్పుడూ లేని విధంగా పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మంత్రులంతా వరద ప్రాంతాలకే పరిమితమయ్యారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో పాటు మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర, అధికార యంత్రాంగం వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వరద నీటిలోనే బాధితులను పరామర్శిస్తున్నారు. నీట మునిగిన కాలనీల్లో జనాన్ని కలిసి ఇబ్బందులను తెలుసుకుంటున్నారు. ప్రజలను ధైర్యం చెబుతున్నారు. వరదలో భయపడొద్దని, అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు.

Advertisement

Next Story