AP Elections 2024: ఉద్యోగస్తులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్

by Indraja |   ( Updated:2024-03-30 10:53:27.0  )
AP Elections 2024: ఉద్యోగస్తులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్
X

దిశ, వెంకటగిరి: వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండ్ల లక్ష్మి సాయిప్రియ ఎన్నికల ప్రచారంలో భాగంగా వెంకటగిరి పట్టణం 11వ వార్డు రాణిపేట నందు ఇంటింటికి తిరుగుతూ స్థానికుల మస్యలు తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వార్డు నందు నివాసం ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులతో ఆమె మాట్లాడగా వారు పడుతున్న ఇబ్బందులను తెలియచేసారు.

ఉద్యోగస్తుల సమస్యలపై స్పందనచిన ఆమె రానున్న ఎన్నికల్లో ఉద్యోగస్తులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డికి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు. అలానే రానున్న ఎన్నిలకల్లో పోటీ చేయనున్న తనకు మద్దతు ఇవచ్చి తనను గెలిపించాల్సిందిగా ప్రజలను కోరారు. ఇక తాను అధికారంలోకి వచ్చాక ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యలను కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేల బాధ్యత తీసుకుంటున్నాని హామీ ఇచ్చారు.

ఇక వార్డును అభివృద్ధి చేసేందుకు స్థానికుల సలహాలు సూచనలు తీసుకున్నారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తుందని ధీమా వ్యక్తం చేసారు. అలానే టీడీపీ అధికారంలోకి రాగానే చేపట్టనున్న సంక్షమా పధకాలు, అభివృద్ధి గురించి వివరించారు. కురుగుండ్ల రామకృష్ణ కుమార్తె అయిన తాను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్నానని.. తనని గెలిపించమని కోరారు.

కాగా కురుగొండ్ల లక్ష్మి సాయి ప్రియా నిర్వహించిన ఈ ప్రచార కార్యక్రమంలో పట్టణ ఆధ్యక్షులు, రాష్ట్ర తెలుగుయువత నాయకులు, 3వార్డు కౌన్సిలర్, పోలేరమ్మ ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యులు, జనసేన -బీజేపీ నాయకులు, యూనిట్ ఇంచార్జీలు, మాజీ కౌన్సిలర్లు, పట్టణ, వార్డు నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

Read More..

ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ

Advertisement

Next Story