- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Letter To DGP: Nara Lokesh పాదయాత్రకు అనుమతివ్వండి
- లోకేశ్‌కు రాజకీయ ప్రత్యర్థులు, ఫ్యాక్షనిస్టుల నుంచి ప్రాణహాని ఉంది
- పాదయాత్రలో కట్టుదిట్టమైన భద్రత కల్పించండి
- డీజీపీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ
దిశ, డైనమిక్ బ్యూరో: ఈ నెల 27 నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టనున్న 'యువగళం' పాదయాత్రకు అనుమతివ్వాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డీజీపీని కోరారు. ఈ మేరకు సోమవారం లేఖ రాశారు. లోకేశ్ పాదయాత్రకు అనుమతితో పాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. డీజీపీకి రాసిన లేఖను హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి జత చేశారు. లోకేశ్ పాదయాత్రకు సంబంధించిన వ్యవహారాలను ఆయన వ్యక్తిగత సిబ్బంది నరేష్ చూసుకుంటారని లేఖలో వెల్లడించారు. లోకేశ్‌ను టార్గెట్ చేస్తూ ఇటీవల సైతం కొంతమంది సంఘ విద్రోహ శక్తులు బెదిరింపులకు పాల్పడ్డారని లేఖలో గుర్తు చేశారు.
రాజకీయ వ్యతిరేకులు, ఫ్యాక్షనిస్టుల నుంచి లోకేశ్ ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో లోకేశ్ పాదయాత్రకు, రాత్రిళ్ల బసకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని లేఖలో కోరారు. భద్రతా ఏర్పాట్లు చూసుకునేలా రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లకు ఆదేశాలు ఇవ్వాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖలో కోరారు.
ఇవి కూడా చదవండి : Kuppam: తప్పుడు ఎఫ్‌ఐఆర్‌లతో అరెస్టులా?