Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి మరోసారి నిరాశ.. బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

by Shiva |   ( Updated:2025-03-10 09:13:27.0  )
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి మరోసారి నిరాశ.. బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నేత నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamshi) బెయిల్‌ పిటిషన్‌పై విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు (SC and ST Court)లో చుక్కెరైంది. ఆయన బెయిల్ పిటిషన్ విచారణ చేపట్టగా.. కౌంటర్‌ దాఖలుకు చేసేందుకు మరికొంత సమయం కావలని పిటిషన్ సత్యవర్ధన్‌ (Satyavardhan) తరఫు న్యాయవాది కోర్టును కోరారు. వారి అభ్యర్థన మేరకు విచారణను వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. అదేవిధంగా వంశీని కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్ కూడా వాయిదా పడింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వంశీ భద్రతారీత్యా బ్యారక్‌ను మార్చలేమని పోలీసులు ఉన్నతాధికారుల కోర్టుకు తెలిపారు. అయితే, అనారోగ్యం కారణంగా వేరే బ్యారక్‌లో మార్చాలనే వంశీ కోర్టును అభ్యర్థించిన విషయం తెలిసిందే.

కాగా, వంశీకి ఒకవేళ బెయిల్‌ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (Public Prosecutor) చివరి విచారణలో కోర్టులో తన వాదనలు వినిపించారు. పోలీసు కస్టడీలో విచారించిన సమయంలో కీలక సమాచారం తెలిసిందన్నారు. వంశీ ఆర్డర్స్‌తోనే సత్యవర్ధన్‌ (Satyavardhan)ను కలిసినట్లు మరో ఇద్దరు నిందితులు విచారణలో అంగీకరించారని కోర్టుకు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో వంశీకి బెయిల్‌ ఇవ్వొద్దని కోరారు. ఆయన నుంచి కేసుకు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టేందుకు మరో 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌ వేసినట్లు కోర్టుకు వివరించారు.

Next Story

Most Viewed