vamsi: వల్లభనేని వంశీకి ఈనెల 17 వరకు రిమాండ్

by Anil Sikha |
vamsi: వల్లభనేని వంశీకి ఈనెల 17 వరకు రిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గన్నరం టీడీపీ కార్యాలయం దాడి కేసులో దళితుడిని కిడ్నాప్​చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం విజయవాడ సబ్​జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (vallabnaneni vamsi) రిమాండ్ (remand) ​ను కోర్టు ఈ నెల 17 వరకు పొడిగించింది. ఈ కేసులో సీఐడీ (CID) పోలీసులు పీటీ వారెంటును (pt warrant) దాఖలు చేశారు. ఇదే కేసులో జైలు నుంచి వంశీని వర్చువల్ గా కోర్టులో ప్రవేశపెట్టారు. గన్నవరం (gannavaram) టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ఏ71 గా ఉన్న విషయం తెలిసిందే. ఆయన గత నెల 11వ తేదీన హైదరాబాద్​లో అరెస్టు అయ్యారు. పోలీసులు వంశీని కస్టడీకి కోరగా మూడురోజులు అనుమతించింది. ఆయనను మూడురోజులపాటు కృష్ణలంక పోలీస్​స్టేషన్​కు తీసుకు వెళ్లి విచారణ జరిపారు. రిమాండ్​లో ఉండగానే ఆయనపై పీటీ వారెంట్లు జారీ అయ్యాయి. హైకోర్టు కూడా ఆయన బెయిలు పిటిషన్​ను కొట్టివేసింది.

Next Story

Most Viewed