రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. నేటి నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు

by Mahesh |
రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. నేటి నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు
X

దిశ, వెబ్ డెస్క్: ఈ సంవత్సరం మార్చి నెల నుంచి ఎండలు దంచికొడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎందర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలు (Untimely rains) కాస్త ఉపశమనం కలిగించాయి. అయితే తెలంగాణ (Telangana) మీదుగా ఏర్పాడిన క్యుములో నింబస్ మేఘాలు ఆంధ్ర వైపు వెళ్లడంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో నేటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు ఆదిలాబాద్‌, కొమురంభీం, మంచిర్యాల జిల్లాల్లో ఉష్ణోగ్రతలు (Temperatures) భారీగా నమోదవుతాయని వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలెర్ట్ (Orange Alert) జారీ చేసింది. దీని ప్రకారం.. పై మూడు జిల్లాల్లో సాధారణం కంటే 2,3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలోని రామగుండంలో 36.4 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని, హైదరాబాద్‌లో 33 డిగ్రీలు దాటనున్నట్లు వాతావరణ శాక అంచనా వేసింది.

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత మూడు రోజులుగా వింత వాతావరణం చోటు చేసుకుంటుంది. ఒకవైపు ఎండలు.. మరోవైపు వానలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎందుర్కొంటున్నారు. నిన్న కోస్తాలో 2 నుంచి 3 డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరగడంతో.. ఉక్కపోత కారణంగా ప్రజలు అల్లాడిపోయారు. మరోవైపు రాయలసీమ, దక్షిణ కోస్తాకు మోస్తారు నుంచి భారీ వర్షం కురువనున్నట్లు వాతావరణ శాఖ సూచించింది. అలాగే. అన్నమయ్య, సత్యసాయి, కర్నూలు జిల్లాలలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో అల్లూరి, మన్యం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది.

Next Story

Most Viewed