- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
స్థానిక ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే ఉత్తరాంధ్ర వెనుకబాటు: ఎంపీ జీవీఎల్ నరసింహారావు

దిశ, డైనమిక్ బ్యూరో : ఉత్తరాంధ్ర ప్రాంతం ఇప్పటికీ వెనుకబడిన ప్రాంతంగానే ఉందని ఎంపీ జీవీఎల్ విమర్శించారు. ఉత్తరాంధ్ర వెనుకబాటు తనానికి స్థానిక ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని మాజీ ఎంపీ జీవీఎల్ ఆరోపించారు. ఉత్తరాంధ్రలో ఆదివారం ఎంపీ జీవీఎల్ పర్యటించారు. ఈ సందర్భంగా జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ...ఉత్తరాంధ్రలో ఉపాధి అవకాశాలు లేకపోవటం బాధాకరమన్నారు. శ్రీకాకుళం జిల్లా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవడం లేదు అని ఆరోపించారు. శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో ఒక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ రాకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రాలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం కేంద్ర సంస్థలకు సంబంధించిన ప్రతిపాదనలు పంపలేదు కాబట్టే ఒక్క సంస్థ కూడా రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఉత్తరాంధ్రలోని కొన్ని కులాలకు ఓబీసీ జాబితాలో స్థానం దక్కలేదన్నారు. కాపులకు జాతీయ స్థాయి రిజర్వేషన్ దక్కలేదని చెప్పుకొచ్చారు. మూడు జిల్లాల పరిధిలోనే కాపులకు బీసీ రిజర్వేషన్ దక్కిందని చెప్పుకొచ్చారు.ఈ అంశంపై స్థానిక ప్రభుత్వాలు కనీస ప్రయత్నాలు కూడా చేయడం లేదని ఎంపీ జీవీఎల్ విమర్శించారు.