వైసీపీలో నేతల్లో ఏదో తెలియని అలజడి..! నియోజకవర్గ ఇంచార్జీల మార్పుతో సీఎంవోకు క్యూ కట్టిన నాయకులు

by Shiva |
వైసీపీలో నేతల్లో ఏదో తెలియని అలజడి..! నియోజకవర్గ ఇంచార్జీల మార్పుతో సీఎంవోకు క్యూ కట్టిన నాయకులు
X

దిశ, వెబ్‌డెస్క్ : రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా రెండో సారి విజయం సాధించి అధికారం చేజిక్కించుకునేందుకు వైసీపీ అధినేత వైసీపీ జగన్ ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. ఈ మేరకు మరో ఎన్నికలు మూడు నెలలు ఉండగానే నియోజకవర్గాల ఇంచార్జీల మార్పునకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే అభ్యర్థుల మార్పునకు సంబంధించి రెండు జాబితాలను విడుదల చేసిన జగన్, మూడో జాబితాను విడుదల చేయాన్నారు. ఈ క్రమంలో టికెట్ కోల్పోయిన నేతలు సీఎం క్యాపు ఆఫీసుకు క్యూ కట్టారు. సీఎం జగన్‌ అపయింట్‌మెంట్ తీసుకొని పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలు చెప్పుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎంవో వద్ద పడిగాపులు కాస్తున్నారు.

ఇప్పటికే టికెట్ పొందిన అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లి ప్రచారాన్ని మొదలుపెట్టగా, అసంతృప్తులు మాత్రం పక్క పార్టీల వైపు చూస్తున్నారు. అకస్మిక పరిణామంతో అసంతృప్త నేతలంతా తమ కేడర్‌తో భేటీ అయి భవిష్యత్తు కార్యాచరణపై దీర్ఘాలోచనలు చేస్తున్నారు. అయితే, ఇవాళ సీఎంను కలిసేందుకు మంత్రులు జోగి రమేశ్‌, కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, గంగుల బ్రిజేంద్రనాథ్‌ రెడ్డి, తదితరులు సీఎంవో ఎదుట పడిగాపులు కాస్తుండటం గమనార్హం. అయితే, వారందరికీ జగన్ సర్ధిచెబుతాడా.. లేక పార్టీ నుంచే పంపిస్తాడా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story