- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
TTD: ఉద్యోగులపై చర్యలకు వెనకాడబోను.. టీటీడీ ఛైర్మన్ సంచలన ప్రకటన
దిశ, వెబ్ డెస్క్: ఉద్యోగులపై చర్యలకు వెనకాడబోనని టీటీడీ ఛైర్మన్(TTD Chairman) బీఆర్ నాయుడు(BR Naidu) స్పష్టం చేశారు. టీటీడీ ఉద్యోగులకు(TTD Employees) నేమ్ బ్యాడ్జ్(Name Badge) ఇచ్చే విషయంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆయన.. టీటీడీ ఉద్యోగులందరికీ త్వరలోనే నేమ్ బ్యాడ్జ్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని తెలిపారు. ఎందుకంటే కొందరు ఉద్యోగులు భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని నా దృష్టికి వచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించే ఉద్యోగులపై చర్యలకు(Actions) వెనుకాడబోనని తేల్చి చెప్పారు. అలాగే ఈ నేమ్ బ్యాడ్జ్ ఇవ్వడం ద్వారా భక్తుల పట్ల అమర్యాదగా వ్యవహరించిన వారిని గుర్తించే అవకాశం ఉంటుందని అన్నారు. శ్రీనివాసుని దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల పట్ల బాధ్యతాయుతంగా, అంకితభావంతో టీటీడీ ఉద్యోగులు ప్రవర్తించేందుకు ఈ బ్యాడ్జ్ విధానం ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. టీటీడీ అన్ని విభాగాల్లో పనిచేసే ప్రతీ ఉద్యోగికి ఈ నేమ్ బ్యాడ్జ్ త్వరలోనే ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తానని టీటీడీ చైర్మన్ అన్నారు.