ఛార్జి తీసుకున్న రెండు రోజుల్లోనే 50 మంది డీఎస్పీల బదిలీలు

by sudharani |
ఛార్జి తీసుకున్న రెండు రోజుల్లోనే 50 మంది డీఎస్పీల బదిలీలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవలే రాష్ట్రంలో డీఎస్పీల బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో మరోసారి డీఎస్పీల బదిలీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 50 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఖాళీగా ఉన్న స్థానాల్లో సైతం డీఎస్పీలను నియమించారు. విజయవాడ పశ్చిమ ఏసీపీగా ఉన్న బి. జనార్ధన్‌ రావును తెనాలి డీఎస్పీగా బదిలీ చేశారు.

వి.ఆర్‌లో ఉన్న కేవీ మహేష్‌ను నరసరావుపేటకు, ఇంటిలిజెన్స్‌లో ఉన్న ఎం బాలసుందర్రావును గుంటూరు ట్రాఫిక్‌ విభాగానికి బదిలీ చేశారు. గుంటూరు విజిలెన్స్‌లో ఉన్న డీఎస్పీ చుండూరు శ్రీనివాసరావును ఒంగోలు దిశా విభాగానికి బదిలీ చేశారు. వీఆర్‌లో ఉన్న కేసిహెచ్‌ రామారావును గుంటూరు దిశా పోలీస్‌ స్టేషన్‌ డీఎస్పీగా నియమితులయ్యారు. ఇదిలా ఉంటే ఒంగోలు డీఎస్పీగా చార్జి తీసుకున్న అశోక్ వర్థన్ రెడ్డి రెండు రోజుల వ్యవధిలోనే బదిలీ అయ్యారు. అశోక్ వర్థన్‌ని దర్శి డీఎస్పీగా బదిలీ చేశారు. అయితే దర్శి డీఎస్పీగా ఉన్న నారాయణ స్వామిరెడ్డిని ఒంగోలు డీఎస్పీగా అవకాశం కల్పించారు. మరో ఏడాది లో సార్వత్రిక ఎన్నికలు జగబోతున్న తరుణంలో డీఎస్పీల బదిలీలు రాజకీయ పరంగా చర్చనీయాంశంగా మారింది

Advertisement

Next Story

Most Viewed