Tirumala Samacharam: తిరుమలలో మళ్లీ పెరిగిన భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఫుల్

by Shiva |
Tirumala Samacharam: తిరుమలలో మళ్లీ పెరిగిన భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఫుల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆపద మొక్కలు వాడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. వరుస సెలవుల నేపథ్యంలో రెండో శనివారం శ్రీవారిని దర్శనానికి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 30 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి 1 క్యూ కాంప్లెక్స్‌లో భక్తులు వేచి ఉన్నారు. అదేవిధంగా ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి భక్తులు టీబీసీ కౌంటర్ వరకు భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. శనివారం స్వామి వారిని 63,493 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.63 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Next Story

Most Viewed