- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో జన్మభూమి-2 కు ముహూర్తం ఫిక్స్
దిశ, వెబ్ డెస్క్: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కూటమి అధికారంలోకి వచ్చింది. వెంటనే పాలనపై దృష్టి పెట్టిన ప్రభుత్వం గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన శాఖలపై మొదట దృష్టి సారించి వ్యవస్థను గాడిలో పెడుతుంది. ఈ క్రమంలోనే మంగళవారం స్థానిక సంస్థలకు భారీగా నిధులు విడుదల చేసింది. అలాగే ఈ రోజు మరికొన్ని శాఖల అధికారులో సమీక్ష నిర్వహించి టీడీపీ హయాంలో చేపట్టిన జన్మభూమి కార్యక్రమం రెండో విడతను ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ క్రమంలో జన్మభూమి-2 ను జనవరి నుంచి ప్రారంభించనున్నారు. కాగా వచ్చే ఐదు సంవత్సరాలలో 17,500 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగాలని.. గ్రామాల అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తామని.. ఏ ఏ గ్రామంలో ఏం అవసరం ఉందో ప్రజల నుంచి వివరాలను సేకరించి.. వాటికి అనుగుణంగా సదుపాయాలు కల్పిస్తామని.. సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.