- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News:వైసీపీ నేత ఇంటిపై ఈడీ సోదాలు.. సీఎం రమేష్ రియాక్షన్ ఇదే!
దిశ,వెబ్‌డెస్క్: విశాఖలో వైసీపీ నేత, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసం పై నేడు(శనివారం) జరుగుతున్న ఈడీ సోదాల పై తాజాగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ స్పందించారు. ఈ క్రమంలో సీఎం రమేష్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం ప్రజలను తీవ్ర స్థాయిలో నష్టపరిచిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు అక్రమాలు చేశారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఏర్పడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి పై ప్రత్యేక ఫోకస్ పెట్టిందన్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు దోచుకున్న అవినీతి సొమ్ము మొత్తం కక్కించి ప్రజల కోసం ఉపయోగించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సీఎం రమేష్ స్పష్టం చేశారు. వైసీపీ నేతల అక్రమార్జనలపై ఈడీ, సీబీఐకి తాను ఫిర్యాదు చేశానని ఎంపీ సీఎం రమేష్ వెల్లడించారు. త్వరలో మాజీ సీఎం జగన్తో పాటు వైసీపీ అక్రమార్కుల బండారాలన్ని బయటపడతాయని అన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని సీఎం రమేష్ పేర్కొన్నారు.