- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బటన్ నొక్కుడుతో మాయ చేశారు..

దిశ డైనమిక్ బ్యూరో : గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం బటన్నొక్కుడుతో మాయ చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. పెడన నియోజకవర్గం నందమూరులోని వాసవీ ఇంజినీరింగ్ కాలేజీలో ఇవాళ ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ ఏ పాలకుడూ చేయని విధ్వంసాన్ని జగన్ చేశాడన్నారు. బటన్ నొక్కుతున్నానని చెబుతూ పరిశ్రమల్ని తరిమేసాడని ఆరోపించారు. వేలాది మంది రైతుల్ని ఒప్పించి చేపట్టిన అమరావతి నిర్మాణాన్ని గాలికి వదిలేశారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు పనుల్ని పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. వీటన్నింటినీ గమనించి ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. జగన్ రెడ్డి పాలనపై ప్రజలు ఎంతగా విసిగిపోయారో, వేధింపులకు గురయ్యారో మొన్నటి ఎన్నికలే నిదర్శనమన్నారు. సోషల్ మీడియాలో పోస్టు పెడితే అరెస్టు, కాలేజీ ఫీజులు అడిగితే బ్లాక్ లిస్ట్ ఇలాం ఎన్నో వేధింపులు, అరాచకాల నుంచి విముక్తి చెంది కూటమి ప్రభుత్వంలో స్వేచ్ఛగా ఉన్నారని తెలిపారు. ఐదేళ్లలో ఆదాయం పెంచకుండా అప్పులు పెంచి, రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు. పెద్దల సభ అంటే ప్రహసనంగా తయారు చేశారని విమర్శించారు. రౌడీలు, గూండాల్ని చట్ట సభలకు పంపారని ఆరోపించారు. పెద్దల సభ గౌరవాన్ని కాపాడుకునేలా గ్రాడ్యుయేట్లు తీర్పు ఇవ్వాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు గారు, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్, మచిలీపట్నం, పెడన జనసేన ఇన్చార్జిలు బండి రామకృష్ణ, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.