- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: నిన్నకృష్ణమ్మ పరవళ్లు.. నేడు లారీలకు గేట్లు
దిశ డైనమిక్ బ్యూరో: నిన్న కుప్పంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. కుప్పం ప్రజలకు నారా చంద్రబాబు నాయుడు ఏం మేలు చేశారు.. కనీసం నీటి సదుపాయం అయినా కల్పించారా అని ప్రశ్నించారు. ఇన్నాళ్లు అసలు చంద్రబాబును కుప్పం ప్రజలు ఎలా భరించారో తనకి అర్ధంకావడంలేదని ఎద్దేవ చేశారు.
అనంతరం పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జగన్.. కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేసి, కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను జాతికి అంకితం ఇచ్చారు. అలానే అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ. 560.29 కోట్ల వ్యయంతో కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్మించిన విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో నిన్న కుప్పంలో పర్యటించిన సీఎం జగన్ కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6,300 ఎకరాల పంటభూములకు సాగునీరు, 4.02 లక్షల జనాభాకు తాగు నీరు అందేలా కృష్ణా జలాలను విడుదల చేస్తూ కుప్పం బ్రాంచ్ కెనాల్ ను ప్రారంభించారు.
అయితే నిన్న పరవళ్లు తొక్కిన కృష్ణమ్మ ఈ రోజు మూగబోయింది. నిన్న జగన్ ప్రారంభించిన కాలువలో నీళ్లు అయిపోయాయి. దీనితో రాజుపేట దగ్గర గేట్లు లారీకి ఎక్కిస్తున్నారు. ఇక అక్కడ గేట్లు లారీలకు ఎక్కిస్తున్న దృశ్యాలు చూసి ప్రతిపక్ష పార్టీలు జగన్ ప్రారంభించిన పధకం గేట్ 24 గంటలు గడవకముందే ముగిసిపోయిందని ఎద్దేవ చేస్తున్నాయి.