విజయనగరం జిల్లాలో ఏనుగుల గుంపు హల్ చల్..భయాందోళన ప్రజలు

by srinivas |
విజయనగరం జిల్లాలో ఏనుగుల గుంపు హల్ చల్..భయాందోళన ప్రజలు
X

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లా వంగర మండలం ప్రజలను గజరాజులు మళ్లీ వణికించాయి. అటవీ ప్రాంతం నుంచి గ్రామ శివారు ప్రాంతాల్లోకి తరచూ ఏడు ఏనుగులు వచ్చి సంచరిస్తున్నాయి. రాజులగుమడ, జేకే, గుమడ గ్రామాల మధ్య పంట పొలాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. మొక్కజొన్న, వరి, చెరుకు పంటలను ధ్వంసం చేస్తున్నాయి. అయితే గున్నకు ఆడ ఏనుగు జన్మనిచ్చింది. ఈ గున్న ఏనుగుకు సెక్యూరిటీగా పెద్ద ఏనుగులు కాపలా కాస్తున్నాయి.

అయితే రాత్రి సమయంలో గ్రామాల్లోకి సైతం వస్తున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీంతో అటవీ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారని, రాత్రంతా గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపి వేశారని తెలిపారు. ఇప్పటికే పలుసార్లు తమ గ్రామాల వైపు వచ్చాయని, పంట పొలాలను ధ్వంసం చేశాయని అంటున్నారు. అటవీ అధికారులు కేవలం ట్రాకింగ్ చేస్తున్నారని, నివారణ చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గ్రామాల్లోకి రాకుండా ఏనుగులను కట్టడి చేయాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed