- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్ రాసిచ్చిన బూతులే ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే తమపై కులం అంటగట్టారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. సొంత చెల్లెలు షర్మిళ విమర్శలపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు సమాధానం చెప్పడం లేదని ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు వదిలిన బాణం షర్మిల అని వైసీపీ నేతలు చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఏపీలో ప్రతికూలమైన పరిస్థితులు కనిపిస్తుండడంతో జగన్ మోడీ జపం చేస్తున్నారని విమర్శించారు.
జగన్ రాసిచ్చిన బూతులనే ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్యలు, అత్యాచారాలు, ఎర్రచందనం స్మగ్లర్లు, ఇసుక మాఫీయా దారులు, కబ్జాకోరులు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులా..? అని ప్రశ్నించారు. ఎన్నికలు సమీపించడంతోనే కోడికత్తి కేసును పెండింగ్ లో పెట్టారని ఆరోపించారు. 5 కోట్ల మంది ఆంధ్రులకు అన్యాయం జరుగుతుంటే జగన్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.
నేతి బీరకాయలో నెయ్యంత ఉందో బడ్జెట్ అలాగే ఉంది
ఎన్నికల కోసమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని, అందమైన బాషతో అందమైన అబద్థాలు నిర్మలా సీతారామన్ చెప్పారని విమర్శించారు. ఉపాధి తప్ప ఉద్యోగాల గురించి చెప్పలేదన్నారు. నేతి బీరకాయలో నెయ్యంత ఉందో బడ్జెట్ అదే విధంగా ఉందని విమర్శించారు. బడ్జెట్ లో అయోధ్య అంశాన్ని ఎందుకు లేవనెత్తారని మండిపడ్డారు. దేశ అధ్యక్షురాలు ద్రౌపదిముర్మును డమ్మీ చేశారని, రాముడిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ రాజకీయాలకు బీజేపీ నేతలు పాల్పడుతున్నారని విమర్శించారు.