ఎన్నికలపై జనసేన ఫోకస్.. యూఎస్ ప్రవాసాంధ్రులకు కీలక ఆదేశాలు

by srinivas |
ఎన్నికలపై జనసేన ఫోకస్.. యూఎస్ ప్రవాసాంధ్రులకు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికలపై జనసేన పార్టీ ఫోకస్ చేసింది. ప్రవాసాంధ్రులను సైతం భాగస్వామ్యులను చేయాలని ప్రయత్నింస్తోంది. ఈ బాధ్యతలను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు తీసుకున్నారు. యూఎస్‌లో ఉంటున్న ప్రవాసాంధ్రులతో టెలికాన్ఫరెన్స్మ నిర్వహించారు. వచ్చే ఎన్నికలపై వారికి దిశానిర్దేశం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రాభివృద్ధికి జనసేన చాలా కీలకమని నాగబాబు చెప్పారు. ప్రవాసాంధ్రులంతా పార్టీ గెలుపునకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. అవకాశం ఉన్న ప్రతి ఎన్ఆర్ఐ జనసైనికుడు రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని తమ నియోజకవర్గాల పరిధిలో జనసేన గెలుపు కోసం అండగా నిలవాలని కోరారు. తటస్ట ఓటర్లను జనసేన వైపు ఆకర్షించాలని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, భావ జాలాన్ని, పవన్ నిర్ణయాలను సామాన్యులకు అర్ధమయ్యేలా వివరించాలని సూచించారు. గత ఎన్నికల్లో విజయం సాధించిన రాజోలు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీసుకుని పని చేయాలని చెప్పారు. ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నవారు తప్పకుండా స్వదేశం వచ్చి పార్టీ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి రావడానికి అవకాశం లేని వారు అక్కడి నుంచే పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేయాలని తెలిపారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న జనసైనికులను సమాయత్తం చేసేందుకు త్వరలో యూఎస్‌లో పర్యటిస్తానని నాగబాబు స్పష్టం చేశారు.

Advertisement

Next Story