- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
హైకోర్టులో జగన్ పిటిషన్ .. మార్చి 6కు విచారణ వాయిదా

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్(Ycp Chief Jagan)పై విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు(Vijayawada People Representatives Court)లో మంత్రి నారాయణ పరువు నష్టం దావా(Minister Narayana's defamation suit) వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి హైకోర్టు(High Court)ను జగన్ ఆశ్రయించారు. తనపై నమోదు అయిన పరువు నష్టం కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు.రెగ్యులర్ విచారణ జరపాలని కోరారు. అయితే ఈ పిటిషన్‌పై కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. దీంతో కౌంటర్ దాఖలుకు మంత్రి నారాయణ తరపున లాయర్ సమయం కోరారు. ఈ మేరకు తదుపరి విచారణను ధర్మాసనం మార్చి6కు వాయిదా వేసింది.
కాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్(Amaravati Inner Ring Road Alignment) మార్పుల వెనుక అప్పటి మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ పాత్ర ఉందంటూ ఒక పత్రికలో కథనాలు వచ్చాయి. సదరు పత్రిక కథనాలతో తన పరువుకు భంగం వాటిల్లిందని విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో మంత్రి నారాయణపరువు నష్టం దావా వేశారు. దీనిపై ఆ కోర్టులో విచారణ జరిగింది. విచారణకు హాజరు కావాలంటూ మాజీ సీఎం జగన్‌కు కోర్టు పలుమార్లు ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే విచారణకు జగన్ హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో కేసును క్వాష్ చేయాలని హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై తాజాగా విచారణ జరిగింది.