- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ రైతుల అకౌంట్లలోకి భారీగా నగదు జమ
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. పంట సాగు, వారి బాగోగుల కోసం ఇప్పటికే ప్రభుత్వం బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు జరిపింది. ఇప్పుడు తాజాగా రైతులకు భారీ గుడ్ న్యూస్ ప్రకటించింది. వారి అకౌంట్లలోకి ఈ మధ్యాహ్నం భారీగా డబ్బులు చేరబోతున్నట్లు స్పష్టం చేసింది. గతంలో రాష్ట్రంలో మిచౌంగ్ తుఫాను భారీ నష్టాన్ని మిగిల్చిన నష్టం అందరికీ తెలిసిందే. అయితే ఆ నష్టాన్ని అంచనా వేసిన ప్రభుత్వం ఇప్పుడు రైతులకు పరిహారం అందించబోతోంది. మధ్యాహ్నం 3 గంటలకు రైతుల ఖాతాల్లోకి ఇన్‌పుట్ సబ్సిడీని సీఎం జగన్ విడుదల చేయనున్నారు. 2023లో ఏర్పడిన కరువుతో పాటు మించౌంగ్ తుఫానుతో నష్టపోయిన పరిహారాన్ని వారి అకౌంట్లలో జమ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11.59 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ మధ్యాహ్నం రూ. 1294.58 కోట్లను బటన్ నొక్కి జమ చేయనున్నారు. ఈ మేరకు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ డబ్బులు విడుదల చేయనున్నారు. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
కాగా అన్నదాతలకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్ద పీట వేస్తున్న విషయం తెలిసిందే. రైతు భరోసా పేరుతో వారికి సాయం చేస్తున్నారు. వార్డు వాలంటీర్ల ద్వారా రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని రైతులు సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు. రుణాలు, బీమా, నిల్వ మార్కెటింగ్‌పై అన్ని రాష్ట్రాల కంటే ఏపీ రైతులకే పూర్తి అవగాహన ఉంది. కిసాన్ క్రిడిట్ కార్డులపై కూడా రైతులకు ప్రభుత్వం నుంచి పూర్తి అవగాహన కల్పించారు. ఇప్పటికే అన్నదాతల కోసం రైతుల భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వివిధ పథకాల కోసం రైతుల చేసిన దరఖాస్తులను సైతం త్వరితగతిన పరిష్కరిస్తున్నారు. ఈ-క్రాప్ పోర్టల్- అప్లికషన్‌ను కూడా ప్రభుత్వం అమలు చేస్తోంది. అంతేకాదు అన్ని క్లైములను పరిష్కరిస్తున్నారు. మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా రైతులకు క్లెయిమ్‌లు అందిస్తున్నారు.