- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: ఎసెన్షియా ప్రమాదంపై స్పందించని యాజమాన్యం.. ప్రభుత్వం సీరియస్
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలి 17 మంది మృతి చెందగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. 50 మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
ఇదిలా ఉంటే ఎసెన్సియా కంపెనీ యాజమాన్యం ఇప్పటివరకూ స్పందించలేదు. స్వయంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కాల్ చేశారు. మెసెజ్ పెట్టారు. అయినా యాజమాన్యం స్పందించలేదు. దీంతో ప్రభుత్వం సీరియస్ అయింది. ఎసెన్షియా యజమాని కిరణ్ కుమార్ అమెరికాలో ఉన్నట్లు గుర్తించారు. ఎసెన్షియాలో సిబ్బంది వివరాలు పోలీసులకు కూడా ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే దుర్ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Advertisement
Next Story