School Holiday:భారీ వర్షాలు..రేపు స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

by Jakkula Mamatha |   ( Updated:2024-07-22 07:35:27.0  )
School Holiday:భారీ వర్షాలు..రేపు స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో గత రెండు రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. రోడ్లన్ని జలమయం కావడంతో రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పశ్చిమ గోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అటు అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్‌లోని 4 మండలాల్లోని స్కూళ్లకు రెండు రోజులు సెలవులు ఇచ్చారు. భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


Hebah Patel: పెళ్లి చేసుకోబోతున్న హెబ్బా పటేల్.. హల్దీ ఫంక్షన్ ఫొటోలు వైరల్

Advertisement

Next Story