- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Breaking: ఆ రోజే వైసీపీ మేనిఫెస్టో విడుదల
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే 13న ఎన్నికల జరగున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలపై ఫోకస్ పెట్టాయి. సీఎం జగన్ ఓ అడుగు ముందుకేసి వైసీపీ మేనిఫెస్టో డేట్‌ను ఖరారు చేశారు. ఉగాది రోజున (ఏప్రిల్ 9న) వైసీపీ ఎన్నికల ఫెనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి తాజాగా ప్రకటించారు. ఈ ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. లబ్ధిదారుల అకౌంట్లో భారీగా నగదును జమ చేసింది. అయితే ఈసారి ఎన్నికల హామీలు ఏమి ఇవ్వబోతున్నారనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఈ నేపథ్యంలో ఉగాదిన తమ మేనిఫెస్టోను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే టీడీపీ 6 గ్యారంటీలు అంటూ రాష్ట్రమంతటా ప్రచారం ప్రారంభించింది. దీంతో వైసీపీ మేనిఫెస్టోపై అంచనాలు భారీగా పెరిగాయి. మేనిఫెస్టోలో అసలు ఎలాంటి అంశాలు పెట్టారనే ఉత్కంఠ నెలకొంది. ఈ సారి కూడా పూర్తిగా సంక్షేమంపైనే హామీలు పొందుపర్చారా లేదంటే అభివృద్ధి, రాజధాని అంశాలపై కూడా మేనిఫెస్టోలో పెట్టారా అనే ప్రశ్నలు ఏపీ ప్రజల మదిలో కదులుతున్నాయి. మరి మేనిఫెస్టో విడుదల తర్వాత ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో చూడాలి.
Read More..