పవన్ కల్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం ఖరారు!

by GSrikanth |   ( Updated:2024-02-19 06:31:27.0  )
పవన్ కల్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం ఖరారు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచాయి. సిద్ధం, సంసిద్ధం అంటూ అధికార వైసీపీ, విపక్ష టీడీపీలు విస్తృతంగా సభలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనూ మేమూ సిద్ధమే అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలు, పోటీ చేయాలనుకునే ఆశావహులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త వైరల్‌గా మారింది.

జనసేనాని పోటీ చేసే నియోజకవర్గం ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈ సారి కూడా పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధినేత ఉండటానికి అక్కడి పార్టీ నేతలు ఓ ఇంటిని సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రేపటి(మంగళశారం) నుంచి రెండ్రోజుల పాటు పవన్ కల్యాణ్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ ఘోర పరాజయం పాలయ్యారు. ఈ క్రమంలోనే పొత్తులు, సీట్ల పంపకాలపై పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.

Read More: గుడివాడలో కొడాలి నానికి ట్విస్ట్.. వైసీపీ అభ్యర్ధి ఆయనే

Advertisement

Next Story

Most Viewed