తీవ్ర విషాదం.. పెళ్లి జరిగిన కాసేపటికే వధువు మృతి

by srinivas |   ( Updated:2024-03-30 12:11:47.0  )
తీవ్ర విషాదం.. పెళ్లి జరిగిన కాసేపటికే వధువు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: పెళ్లి అయిన కాసేపటికే నవ వధువు మృతి చెందారు. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగింది. యువతి అఖిలకు మక్కున మండలం దబ్బగడ్డకు చెందిన యువకుడితో ఆదివారం రాత్రి 10 గంటలకు వివాహం జరిగింది. అయితే కొద్దిసేపటికే నీరసంగా ఉందని అఖిల గదిలోకి వెళ్లి నిద్రపోయారు. కొద్ది సేపటి తర్వాత అఖిలను నిద్రలేపేందుకు బంధువులు ప్రయత్నం చేశారు. ఎంతకీ పైకి లెగవకపోవడంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. కానీ ‘అఖిల ఎలా చనిపోయారు. పెళ్లి ఇష్టం లేదా..? ఆత్మహత్య చేసుకున్నారా..?, గుండెపోటుతో మరణించారా..?, అనారోగ్యం కారణంతో మృతి చెందారా?, వేరే ఏదైనా కారణాలు ఉన్నాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. విషయం తెలుసుకున్న అఖిల మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed