- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
MLC : డిసెంబర్ 5న గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల(East Godavari, West Godavari) ఉపాధ్యాయ ఎమ్మెల్సీ(Teacher Mlc) ఉప ఎన్నిక(By-election)కు రంగం సిద్ధమైంది డిసెంబర్ 5వ తేదీన ఉమ్మడి గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ మంగళవారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు కొనసాగనుంది. 19న నామినేషన్ల పరిశీలన నిర్వహిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు 21. డిసెంబరు 5న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. డిసెంబరు 9న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నట్లు ఇసీ తెలిపింది.
2021లో ఈ స్థానం నుంచి ప్రొగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పిడిఎఫ్) తరపున గెలిచిన యుటిఎఫ్ నేత ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ 2023 డిసెంబర్ 15న రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు.