- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేడు టీడీపీ వినూత్న నిరసన: చేతులకు తాళ్లతో సంకెళ్లు వేసుకుని ఆందోళనకు పిలుపు
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వినూత్న నిరసనకు పిలుపునిచ్చారు.‘న్యాయానికి సంకెళ్లు’పేరుతో నిరసనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి 7 గంటల నుంచి 5 నిమిషాలపాటు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ చేతులకు తాళ్లు, రిబ్బన్లు, వస్త్రాలతో సంకెళ్లు వేసుకుని నిరసన తెలపాలని లోకేశ్ ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు. వాకిళ్లు, బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి సంకెళ్లను చూపించాలని సూచించారు. ఈ సందర్భంగా న్యాయానికి ఇంకెన్నాళ్లు సంకెళ్లు అని నినదించాలని లోకేశ్ పిలుపునిచ్చారు. విదేశాల్లోని తెలుగు ప్రజలు సైతం భారత కాలమాన ప్రకారం ఆ సమయంలో నిరసనగళం వినిపించాలని లోకేశ్ సూచించారు. ఈ నిరసనలో పాల్గొన్న ప్రతీ ఒక్కరూ వీడియోలు తీసి వాటిని ట్విటర్, ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలని సూచించారు. ధర్మ పోరాటానికి మద్దతుగా నిలవాలని లోకేశ్ ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.