జనసేన కిందే టీడీపీ..మెజార్టీ సీట్లు సాధిస్తే పవనే సీఎం : మెగా బ్రదర్ నాగబాబు

by Seetharam |
జనసేన కిందే టీడీపీ..మెజార్టీ సీట్లు సాధిస్తే పవనే సీఎం :   మెగా బ్రదర్ నాగబాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీతో పొత్తులు, గతంలో టీడీపీతో ఎదురైన అనుభవాలను పార్టీ కార్యకర్తలతో పంచుకున్న నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పొత్తులో భాగంగా అత్యధిక స్థానాల్లో జనసేన పార్టీ విజయం సాధిస్తే పవన్ కల్యాణ్ సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు జనసేన పార్టీ కిందనే టీడీపీ పనిచేయాల్సి ఉంటుందంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ హయాంలో ఆ పార్టీ నేతలు తమను వేధించారని నాగబాబు ఎదుట పలువురు జనసైనికులు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో వారిని నాగబాబు ఊరడించారు. గతాన్ని మరచి మంచి భవిష్యత్ కోసం ముందుకు సాగాలని నాగబాబు సూచించారు.

పొత్తులో టీడీపీ మన కిందే పని చేస్తుందని చెప్పుకొచ్చారు. టీడీపీ నేతలు మన కిందనే పనిచేస్తారని చెప్పుకొచ్చారు. టీడీపీతో పొత్తులో ఉన్నప్పటికీ జనసేన నేతలు మాత్రం మన పార్టీ అజెండానే ముందుకు తీసుకెళ్లాలంటూ కీలక సూచనలు చేశారు. అంతేకాదు అత్యధిక స్థానాల్లో జనసేన గెలుపొందితే సీఎం పవన్ కల్యాణ్ అని చెప్పుకొచ్చారు. ఇకపోతే పవన్ కల్యాణ్ టీడీపీతోనే కలిసి ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి ఎవరు అనేది గెలుపొందిన తర్వాత చూద్దాం అని అభిప్రాయపడ్డారు. ముందు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతీ ఒక్కరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. అధినేత పవన్ కల్యాణ్ ఇంతలా చెప్పినా నాగబాబు మాత్రం పవనే సీఎం.. టీడీపీ జనసేన కిందే పనిచేయాలి అంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

More News : జైలులో ఉన్న చంద్రబాబుపై అవి పగతీర్చుకోబోతోన్నాయా?.. సంచలనం సృష్టిస్తోన్న ట్వీట్

Advertisement

Next Story