ముందు ఆంధ్రప్రదేశ్‌ స్పెల్లింగ్‌ కరెక్ట్‌గా రాయండి.. వైసీపీకి టీడీపీ కౌంటర్

by GSrikanth |   ( Updated:2024-01-05 12:36:32.0  )
ముందు ఆంధ్రప్రదేశ్‌ స్పెల్లింగ్‌ కరెక్ట్‌గా రాయండి.. వైసీపీకి టీడీపీ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఆంధప్రదేశ్ రాజకీయాలు ఆసక్తిగా మారాయి. అభ్యర్థుల మార్పుతో వైసీపీ నేతలు, మేనిఫెస్టో తయారీపై టీడీపీ-జనసేన శ్రేణులు ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకవైపు రాజకీయ వ్యూహాలు పన్నుతూనే.. మరోవైపు శత్రు పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వైసీపీ, జనసేన, టీడీపీ శ్రేణులు ట్వీట్ల వార్ నడుస్తోంది. ఇటీవల విడుదలైన బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ నటించిన డంకీ సినిమా పోస్టర్‌ను రీక్రియేట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

నటీనటులు షారుఖ్, తాప్సీ ముఖాలపై నారా లోకేష్, రామోజీరావు ఫొటోలను ఎడిట్ చేసి వైసీపీ శ్రేణులు పోస్టు పెట్టారు. దీనికి ‘‘పేదలకు జగనన్న ప్రభుత్వం చేస్తున్న మంచిని అడ్డుకుంటున్న ఈ పచ్చ హమాస్ బ్యాచ్ మన రాష్ట్రం నుంచి తరలిపోయే రోజు త్వరలోనే రానుంది’’ అని క్యాప్షన్ ఇచ్చారు. దీనిపై టీడీపీ శ్రేణులు స్పందించారు. ‘ముందు ఆంధ్రప్రదేశ్‌ స్పెల్లింగ్‌ తెలుసుకోండిరా’ అని కౌంటర్ ట్వీట్ పెట్టారు. అయితే, వైసీపీ ట్వీట్‌లో పెట్టిన ఇంగ్లీష్ క్యాప్షన్‌లో ఆంధ్రప్రదేశ్‌కు బదులు.. ఆంధ్రపర్‌దేశ్ అని పెట్టారు. దీనికి ఇరు పార్టీల నేతలు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Read More : ఆంధ్రప్రదేశ్ PCC చీఫ్‌గా వైఎస్ షర్మిల.. ఆరోజే అధికారిక ప్రకటన?

Advertisement

Next Story