- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందితే జుట్టు..అందకపోతే కాళ్ళు ఇదే ఆయన నైజం.. నేతల మధ్య మాటల తూటాలు
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ అయిన వైసీపీకి ప్రతిపక్ష పార్టీ టీడీపీకి మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమంటోంది. ఇరు పార్టీ నేతలు అటు సభల్లోనూ ఇటు సోషల్ మీడియాలోనూ ఒకరిపై మరొకరు విమర్శల జల్లు కురిపించుకుంటున్నారు.
తాజాగా టీడీపీ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ ను విమర్శిస్తూ ఓ పోస్ట్ చేసింది. జగన్ రెడ్డి మరోసారి మాట, మడమ తిప్పేసాడు అని పేర్కొంది. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అని జగన్ రెడ్డి లాంటి వారిని చూసే అని ఉంటారని ఎద్దేవ చేసింది. లోక్‌సభలో, రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఏఏ చట్టానికి సంపూర్ణ మద్దతు ప్రకటించి, ఇప్పుడు ఏమి తెలియనట్టు భలే నాటకాలు ఆడుతున్నారుగా అంటూ పోస్ట్ లో రాసుకు వచ్చింది.
కాగా టీడీపీ చేసిన ఈ ట్వీట్ పై వైసీపీ స్పందించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఏఏ చట్టం వల్ల దేశంలోని ముస్లింలు ఆందోళన చెందుతున్నారని.. ఈ చట్టాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని పేర్కొంది. ఏపీలోని ముస్లిం వర్గాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. సీఎం జగన్ అన్ని కులాలకు, మతాలకు సమ ప్రాధాన్యం ఇస్తారని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మాట్లాడిన వీడియోని కామెంట్ లో పిన్ చేసింది.