వైసీపీకి స్ట్రోక్ ఇచ్చేలా టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్!

by Ramesh N |   ( Updated:2024-02-24 09:34:05.0  )
వైసీపీకి స్ట్రోక్ ఇచ్చేలా టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్న టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. ఈ ఫస్ట్ లిస్ట్‌లో మొత్తం సీట్లకు గాను అభ్యర్థులను పార్టీ అధినేతలు ప్రకటించారు. ఈ జాబితాలో మొత్తం 188 స్థానాలను ప్రకటించగా.. ఇందులో టీడీపీకి 94, జనసేనకు 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. జనసేన అభ్యర్థులను ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్, టీడీపీ అభ్యర్థులను పార్టీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని నివాసంలో మొత్తం 118 స్థానాలకు ఇరు పార్టీలు అభ్యర్థులను ప్రకటించారు.

వైసీపీ ఊహించని తీరులో జాబితా!

వైసీపీ నుంచి పలువురు అభ్యర్ధులను ఇప్పటికే ఆ పార్టీ నుంచి ప్రకటించిన విషయం తెలిసిందే. వైసీపీ పార్టీ అధిష్టానం ఊహించని తీరులో టీడీపీ-జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించిందని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. ఆ పార్టీకి స్ట్రోక్ ఇచ్చేలా టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్ విడుదల చేశారని చర్చ జరుగుతున్నది. అభ్యర్థుల జాబితా విడుదల సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మాఘ పౌర్ణమి శుభదినాన టీడీపీ-జనసేన పోటీకి సిద్ధమవుతున్నామన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే టీడీపీ-జనసేన కలయిక అని తెలిపారు. ఇప్పటం సభలో జరిగిన నిర్ణయాలకు అనుగుణంగానే పొత్తులు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు.

బీజేపీని దృష్టిలో పెట్టుకుని సీట్ల సర్దుబాటు: వపన్

పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీని అభివృద్ధి బాటలో నడిపించాలని.. రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసమే టీడీపీ జనసేన అలయెన్స్ ఏర్పడిందన్నారు. తమ పొత్తుకు బీజేపీ ఆశీస్సులు ఉన్నాయన్నారు. బీజేపీని దృష్టిలో పెట్టుకుని సీట్ల సర్దుబాటు చేశామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ విముక్త ఏపీ లక్ష్యంగా కలిసి పని చేస్తామన్నారు. అనంతరం పవన్ 5 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. మిగతా 19 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి త్వరలో ప్రకటన చేస్తామన్నారు. పొత్తులో భాగంగా 3 ఎంపీ సీట్లు, 37 అసెంబ్లీ సీట్లు, టోటల్ గా జనసేన 40 స్థానాల్లో పోటీ ఉంటుందని పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. కాగా, ఫస్ట్ లిస్ట్‌లో మాత్రం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు చోటు దక్కలేదు.

Read More..

రక్తతర్పణం చేసిన కనికరించని చంద్రబాబు.. ఫస్ట్ లిస్ట్‌లో వీర విధేయుడి పేరు మిస్సింగ్..!


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed