BREAKING: మరికాసేపట్లో TDP-జనసేన ఫస్ట్ లిస్ట్ రిలీజ్.. పవన్ కల్యాణ్ పోటీ అక్కడినుండే..!

by Satheesh |   ( Updated:2024-02-24 08:20:33.0  )
BREAKING: మరికాసేపట్లో TDP-జనసేన ఫస్ట్ లిస్ట్ రిలీజ్.. పవన్ కల్యాణ్ పోటీ అక్కడినుండే..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హీట్ రాజుకుంది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలైనా టీడీపీ, వైసీపీ, జనసేన గెలుపు గుర్రాల వేటలో నిమగ్నమైపోయాయి. సీఎం జగన్ ఇప్పటికే 7 విడతల్లో పలువురు అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా అభ్యర్థుల ప్రకటనకు టీడీపీ, జనసేన సిద్ధం అయ్యాయి. ఇవాళ టీడీపీ-జనసేనల తొలి ఉమ్మడి జాబితా విడుదల కానుంది. దాదాపు 65 మంది పేర్లతో మరీ కాసేపట్లో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయనున్నాయి. అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. అచ్చెన్నాయుడు, నక్కా ఆనంద్ బాబు, నిమ్మల రామానాయుడు యనమల, తదితర నేతలతో సమావేశమైన బాబు అభ్యర్థుల ప్రకటనపై చర్చిస్తున్నారు. మరి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబు ఇంటికి చేరుకోనున్నారు.

అనంతరం పవన్, చంద్రబాబు కలిసి ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నారు. ఎలాంటి చిక్కులు లేని స్థానాలను ఈ ఫస్ట్ లిస్ట్‌లో ప్రకటించనున్నట్లు టాక్. ఫస్ట్ లిస్ట్‌లోనే టీడీపీ, జనసేన కీలక నేతల పేర్లు ఉండే అవకాశం ఉంది. కుప్పంలో చంద్రబాబు, భీమవరం నుండి పవన్ కల్యాణ్, మంగళగిరి నుండి లోకేష్, టెక్కలిలో అచ్చెన్నాయుడు, తెనాలిలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ వంటి కీలక నేతల పేర్లు ఫస్ట్ లిస్ట్‌లో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. బీజేపీతో పొత్తుపై క్లారిటీ వచ్చిన తర్వాత మిగిలిన స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించనున్నారు. కాగా, టీడీపీ-జనసేన అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. లిస్ట్‌లో తమ పేర్లు ఉంటాయో లేదోనని ఆశావాహుల్లో టెన్షన్ నెలకొంది. మరి కాసేపట్లో లిస్ట్ విడుదల కానుండగా ఎవరి సీటు దక్కుతుంది.. ఎవరికి మొండి చూపించారో తేలనుంది.

Read More..

వ్యూహం మార్చిన పవన్.. టికెట్ కావాలంటే ఆ పని చేయాల్సిందేనని తేల్చిచెప్పిన జనసేనాని..!

పొత్తుపై ఎటూ తేల్చని BJP ‘ఢిల్లీ’ పెద్దలు.. చంద్రబాబు ఆ సీట్లు ఇచ్చేందుకు ఒప్పుకోకపోవడమే కారణమా..?

Advertisement

Next Story