- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Praja Galam: జబర్దస్తీ ఎమ్మెల్యే అంటూ రోజాపై చంద్రబాబు సెటైర్స్

దిశ, వెబ్ డెస్క్: జబర్దస్తీ ఎమ్మెల్యే అంటూ మంత్రి రోజాపై టీడీపీ అధినేత చంద్రబాబు సెటైర్స్ వేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మంత్రి రోజాపై విమర్శలు చేశారు. నగరిలో జబర్దస్తీ ఎమ్మెల్యే ఉన్నారని... ఆమెకు దోచుకోవడం తప్ప ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తానని చెప్పి ఓ మహిళ నుంచి రూ. 40 లక్షలు తీసుకున్నారని మండిపడ్డారు. నగరిలో ఇసుక, గ్రావెల్‌పై దౌర్జన్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూదందాలకు రోజా కుటుంబం పాల్పడిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నగరి టీడీపీ అభ్యర్థిగా భాను ప్రకాశ్ ఉన్నారని.. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ముద్దుకృష్ణమ నాయుడును తలపించేలా భాను ప్రకాశ్ ప్రజా సేవ చేస్తాడని తెలిపారు. మంచి నాయకుడిగా భాను పని చేస్తారని చెప్పారు. భాను ప్రకాశ్‌తో మంచిగా ప్రజా సేవ చేయించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే నగరిలో మూతపడిన చక్కెర కంపెనీని మళ్లీ తెలిపిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
Read More..
ఇండిపెండెంట్‌గా చేసి నేనేంటో చంద్రబాబుకు చూపిస్తా.. పరిపూర్ణానంద స్వామి సవాల్