MahaPrastanam: ముగిసిన తారకరత్న అంత్యక్రియలు

by srinivas |   ( Updated:2023-02-20 11:37:36.0  )
MahaPrastanam: ముగిసిన తారకరత్న అంత్యక్రియలు
X

దిశ, వెబ్ డెస్క్: నందమూరి తారకరత్న అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆయనకు నందమూరి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి మోహనకృష్ణ దహన సంస్కాలు చేశారు. బాలయ్యతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు తారకరత్న పాడెను మోశారు. నందమూరి బాలకృష్ణ నిర్ణయించిన సమయానికే తారకరత్న అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నందమూరి, నారా కుటుంబ సభ్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా తారకరత్న అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంతకుముందు ఫిల్మ్ ఛాంబర్‌లో తారకరత్న పార్ధివదేహాన్ని ఉంచినప్పుడు కూడా విజయసాయిరెడ్డి అక్కడే ఉన్నారు. అనంతరం నిర్వహించిన అంతియ యాత్రలోనూ ఆయన పాల్గొన్నారు.

కాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం కుప్పం పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న గుండెపోటు రావడంతో స్పృహతప్పి పడిపోయారు. స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. 23 రోజుల పాటు చికిత్స పొందిన తారకరత్న చివరకు తుది శ్వాస విడిచారు. దీంతో ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ శంకర్ పల్లి మండలం మోకిలలోని స్వగృహానికి తరలించారు. అనంతరం అభిమానుల సందర్శనార్ధం సోమవారం ఉదయం నుంచి ఫిల్మ్ ఛాంబర్‌లో ఉంచారు. అనంతరం అంతియయాత్ర నిర్వహించి అంత్యక్రియలు చేశారు.

Advertisement
Next Story

Most Viewed