- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుమల లడ్డూ, పవన్ కల్యాణ్‌పై సీమాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ విషయం తప్ప దేశంలో ఇంకే సమస్య లేదా అని, శ్రీవారి ప్రసాదం తిని ఎవరైనా చనిపోయారా అంటూ ఇప్పటికే తమిళనాడు ఎన్టీకే పార్టీ చీఫ్ సీమాన్(Tamil Nadu NTK Chief Seaman) వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఇప్పుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లడ్డూ(Tirupati Laddu)లో సనాతన ధర్మం(Sanatana Dharma) ఉందంటే ఒప్పుకోమని ఆయన హెచ్చరించారు. తిరుమల లడ్డూ వ్యహారంపై సినీ నటులు సెటైర్లు వేయడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Ap Deputy Cm Pawan Kalyan) ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో సీమాన్ స్పందించారు. ఉప ముఖ్యమంత్రిగా ఉండి తిరుమల లడ్డూపై రాజకీయ వ్యాఖ్యలు తగవని చెప్పారు. బరువు తగ్గేందుకే పవన్ కల్యాణ్ దీక్ష చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తిరుమల లడ్డూపై నటుడు కార్తీ(Actor Karthi) చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదన్నారు. సినిమాలు అడ్డుకుంటారనే భయంతోనే కార్తీ క్షమాపణలు చెప్పారని సీమాన్ పేర్కొన్నారు.