TDP LEADER: నేను చంద్రబాబు అంత మంచోడ్ని కాదు

by Gantepaka Srikanth |
TDP LEADER: నేను చంద్రబాబు అంత మంచోడ్ని కాదు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్‌టీపీపీ(RTPP) ఫ్లైయాష్ వివాదంతో తనకు సంబంధం లేదని టీడీపీ(TDP) నేత జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను సీఎం చంద్రబాబు(CM Chandrababu) అంత మంచి వాడిని కాదని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతు నోరు పారేసుకుంటే బాగోదని హెచ్చరించారు. గతంలో టీడీపీ కార్యకర్తలను దారుణంగా వేధించారని గుర్తుచేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్(Pawan Kalyan), లోకేష్‌(Lokesh)లను ఇక నుంచి ఎవరు విమర్శించినా ఊరుకోము అని అన్నారు. కేతిరెడ్డి సంగతి త్వరలోనే తేలుస్తా అని కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతరం వెంకట రామిరెడ్డిని ఊరి నుంచి తరిమేస్తా అని అన్నారు.

ఇదిలా ఉండగా.. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (RTPP) ఫ్లైయాష్ వివాదం సచివాలయానికి చేరింది. సీఎం చంద్రబాబు పిలుపుతో జమ్మలమడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, భూపేష్ రెడ్డి సచివాలయానికి వచ్చి సీఎంతో సమావేశమయ్యారు. తాను జ్వరం వల్ల హాజరు కావడం లేదని జేసీ ప్రభాకర్‌రెడ్డి సమాచారం ఇచ్చారు. ఫ్లైయాష్ కాంట్రాక్టులో నేతల మధ్య వివాదంతో కూటమి ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటోందని ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నేతలతో చర్చించేందుకు సిద్ధమయ్యారు.




Next Story

Most Viewed