- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వింత ఆచారం: శివస్వామికి 50కేజీల కారంతో భక్తుల అభిషేకం
దిశ, డైనమిక్ బ్యూరో : శిశుడు అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకాలు చేస్తారు. అలాగే ఇతర దేవాది దేవుళ్లకు కూడా పలు అభిషేకాలు చేస్తారు. దేవతలకు ఇష్టమైన ఆహారపదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇకపోతే స్వాములకు,ఉపాసకులకు పండ్లు, ఫలాలను సమర్పించి ఆశీస్సులు తీసుకుంటారు. కానీ ఓ స్వామికి ఏకంగా ఎర్రని కారంతో అభిషేకించారు. ఇది ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే ఏలూరు జిల్లా దొరసానిపాడులోని శ్రీశివ దత్తాత్రేయ ప్రత్యంగిరా వృద్ధాశ్రమంలో దేవీ ఆవాహనలో ఉన్న శివస్వామిని భక్తులు పెద్ద ఎత్తున కారంతో అభిషేకించారు. ప్రత్యంగరి దేవి ఉపాసకులు శివ స్వామికి గ్రామస్తులు, భక్తులు ఎర్రని కారంతో అభిషేకాన్ని నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
50కేజీల కారంతో అభిషేకం
కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శివ స్వామి ప్రత్యంగరి దేవికి పూర్ణాహుతి హోమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ప్రత్యంగరా దేవిని ఆవాహన చేసుకుని దీపోత్సవాన్ని చేపట్టారు. దీపోత్సవం అనంతరం దేవి ఆవాహనలో ఉన్న శివ స్వామిని భక్తులు పెద్ద ఎత్తున కారంతో అభిషేకించారు. ఈ కారంతో అభిషేకం వింతగా ఉండటంతో ఆ దృశ్యాన్నితిలకించేందుకు భక్తులు, గ్రామస్తులు తరలివచ్చారు. దాదాపు 50 కేజీలలకుపైగా కారంతో శివ స్వామిని భక్తులు అభిషేకించారు. అనంతరం భక్తుల తమ వెంటతెచ్చుకున్న కవర్లలో కారంతో అభిషేకం చేశారు.
పురాణాలు చెప్తుందేంటంటే
ఇకపోతే హిరణ్యకశికుడిని నరసింహస్వామి వధించిన అనంతరం స్వామివారి ఉగ్రరూపాన్ని తగ్గించేందుకు ప్రత్యంగరి దేవి ఉద్భవించిందనీ పురాణాల ద్వారా తెలుస్తోంది. అయితే ప్రత్యంగిరీ దేవికి ఎండుమిరపకాయలు అంటే ఎంతో ఇష్టం. అంతేకాక ప్రత్యంగిరీ దేవికి ఎండుమిరపకాయలను మెడలో హారంగా చేసి దండలు వేసి పూజిస్తారు. శివ స్వామి ప్రత్యంగిరి ఆవాహనలో ఉన్న సమయంలో అభిషేకిస్తే వారికి బాధలు, కష్టాలు తొలగి శత్రువినాశనం జరిగి, లక్ష్మీ కటాక్షం పొందుతారని నమ్మకం. అంతేకాక దేవికి ఇష్టమైన ప్రసాదంగా కారాన్ని ఉపయోగిస్తారని.. ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో కార్తీక బహుళ తదియ రోజున కారంతో అభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తుందని శివస్వామి చెబుతున్నారు. 29 ఏళ్లుగా హైదరాబాద్‌లో కారంతో అభిషేకం నిర్వహిస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఇది రెండోసారి అని శివస్వామి వెల్లడించారు.