గర్భిణులకు రాష్ట్ర సర్కార్ సూపర్ న్యూస్

by Anjali |   ( Updated:2023-05-14 06:36:57.0  )
గర్భిణులకు రాష్ట్ర సర్కార్ సూపర్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ మహిళలకు సర్కారు శుభవార్త తెలిపింది. గర్భంలోని శివువు ఎదుగుదల, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే టిఫా స్కాన్ కోసం ప్రైవేటు డయాగ్నోస్టిక్స్‌లో భారీ మొత్తంలో చెల్లించాల్సిన అవసరం లేకుండా టిఫా స్కాన్ సదుపాయాన్ని గవర్నమెంట్ హాస్పటల్‌లోనే అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా రూ.1,100 విలువైన టిఫా స్కాన్, 250 రూపాయల అల్ట్రా సోనోగ్రామ్ స్కానులను ఆరోగ్యశ్రీ పథకం కింద ఫ్రీగా చేయనుందని తెలిపారు. పిండంలో లోపాలు, బిడ్డ పొజిషన్, ఉమ్మనీరు స్థితి తదితరాలను టిఫా స్కాన్‌తో గుర్తించవచ్చు. అయితే ఈ స్కానింగ్‌ను 18-22 వారాల గర్భస్థ దశలోనే చేయడం జరుగుతుంది.

Also Read..

YS రాజశేఖర్ రెడ్డికి సమస్కరించి నివాళులర్పించిన లోకేష్ (వీడియో)

Advertisement

Next Story