ఆ పాడు పని ఎందుకు చేశాడో?.. తమ్ముడిపై రాజమోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2023-04-07 13:46:17.0  )
ఆ పాడు పని ఎందుకు చేశాడో?.. తమ్ముడిపై రాజమోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేకర్ రెడ్డిపై ఆయన సోదరుడు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చేసిన తప్పిదాల వల్లే ఈ పరిస్థితులు చోటు చేసుకున్నాయని తప్పుబట్టారు. ఉదయగిరిలో కనీసం సీటు కూడా లేకుండా పోవడానికి తమ్ముడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చేసిన తప్పులే కారణమన్నారు. ప్రజలిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని పరిపాలన చక్కగా చేసి ఉంటే మరో అవకాశం ఇచ్చి ఉండేవారని రాజమోహన్ రెడ్డి చెప్పారు. అటు టీడీపీకి క్రాస్ ఓటు వేశారన్నదానిపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పాడుపని ఎందుకు చేయాల్సి వచ్చిందోనని ఆవేదన వ్యక్తం చేశారు. ఓపిక ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేయాలనుకునేవారు ఇలాంటి పనులు చేయకూడదన్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్ల ఎంతో ప్రశాంతంగా ఉన్నానని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story