డ్రగ్సాంధ్రప్రదేశ్గా మార్చేశారు.. టీడీపీ నేతలు

by Javid Pasha |
డ్రగ్సాంధ్రప్రదేశ్గా మార్చేశారు.. టీడీపీ నేతలు
X

దిశ, నెల్లూరు: సీఎం జగన్ వైసీపీ ప్రభుత్వం రూపంలో రాష్ట్ర ప్రజలకు శనిలా దాపరించి రాష్ట్ర యువతను గంజాయి, మాదకద్రవ్యాలకు బానిసలుగా మార్చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. గోవర్ధన్ రెడ్డి చంద్రబాబు లోకేష్ లను విమర్శిస్తే పేపర్లో పడతారేమో గానీ ప్రజల్లో విశ్వాసం కోల్పోతారని హితవు పలికారు. ఈ మేరకు మద్యం మత్తు వద్దు ఉద్యోగాలే ముద్దు అన్న నినాదంతో నెల్లూరు రూరల్ లోని వేదయపాలెం సెంటర్ నుండి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు నిరుద్యోగులతో కలిసి టీడీపీ నాయకులు ఆదివారం నిరసన ర్యాలీ నిర్వహించారు.

వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ర్యాలీ అనంతరం బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ను డ్రగ్సాంధ్రప్రదేశ్ గా మార్చేశారని, ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్న దొంగ హామీతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారని టీడీపీ నేతలు విమర్శించారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాకతో రాష్ట్ర యువతకు దరిద్రం పట్టిందని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధి పథంలో నడుస్తున్న రాష్ట్రాన్ని జగన్ దౌర్భాగ్య పరిస్థితుల్లోకి నెట్టేసారని ఒక వ్యక్తి రాష్ట్రాన్ని నాశనం చేయగలరని జగన్ నిరూపించి చూపారని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed