Somireddy: నాలుగేళ్లకే స్క్రిప్ట్ రివర్స్

by srinivas |   ( Updated:2023-03-25 13:42:34.0  )
Somireddy: నాలుగేళ్లకే స్క్రిప్ట్ రివర్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతన ప్రారంభమైందని, ఈ సారి అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. 2019 మే 23న దేవుడు స్క్రిప్ట్ అద్భుతంగా రాశాడని వైఎస్ జగన్ అన్నారని, కానీ ఆ దేవుడు ఇప్పుడు స్క్రిప్ట్ తిరగరాశాడని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లకే భగవంతుడు స్క్రిప్ట్ తిరగరాశాడని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను లాక్కున్న జగన్.. నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. నిద్రలేస్తే చాలు ఎమ్మెల్యేలు, మంత్రులు, వైసీపీ నేతలు అవినీతి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. వైసీపీలో లేచిపోయిన వారు టీడీపీకి అండగా నిలుస్తున్నారని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు.

అకాల వర్షాలపైనా సోమిరెడ్డి స్పందించారు. తెలంగాణాలో వడగండ్లు పడ్డా ఏమీ కాలేదని..రైతులకు నష్టం జరగలేదని చెప్పారు. కానీ ఏపీలో మాత్రం జగన్ పాదమహిమ వల్ల వడగండ్లు పడ్డాయని.. రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారన్నారు. రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

Next Story