- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Devineni Uma: నెల్లూరు జిల్లా పోలీసులపై సంచలన వ్యాఖ్యలు
దిశ, నెల్లూరు: టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి అమానుషమని మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమా పేర్కొన్నారు. నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యా లయంలో మాజీ మంత్రి దేవినేని ఉమా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనం వెంకటరమణారెడ్డిపై దాడిని ఖండిస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకెళ్తూ ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న వెంకటరమణారెడ్డిపై దాడి సమంజసం కాదన్నారు. జగన్ యుగంలో జగన్ ఆజ్ఞ లేనిదే సజ్జల అనే చీమ కుట్టదని చమత్కరించారు. నెల్లూరు జిల్లాలో ఎన్నడూ లేని రీతిలో రౌడీ రాజకీయాలకు తెర లేపుతూ కొత్త పంథా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఘటన జరిగి 24 గంటలు గడుస్తున్నా పోలీసులు కఠిన చర్యలు చేపట్టకపోవడం దుర్మార్గమన్నారు. నెల్లూరు జిల్లాలో పోలీసులు వైసీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి విషయమై జిల్లా ఎస్పీ దృష్టి సారించి కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.