- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం ఒక క్యాన్సర్ గడ్డ.. వెంటనే తొలగించాలి: చంద్రబాబు
దిశ, నెలూరు: సీఎం జగన్ రాష్ట్రానికి పట్టిన దరిద్రమని, క్యాన్సర్ గడ్డ లాంటి వారని, ఆపరేషన్ చేసి వెంటనే తొలగించాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. శుక్రవారం నెల్లూరులో నిర్వహిచిన జోన్-4 సమావేశాల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సమావేశంలో 5 పార్లమెంట్ 35 నియోజకవర్గాల టీడీపీ ఇంచార్జుల, క్లష్టర్ ఇంచార్జులు హాజరయ్యారు. ఈ సందర్బంగా పార్టీ నేతలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. వైసీపీని ఓడించి బంగాళాఖాతంలో కలపాలని, వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో జగన్ పార్టీ చిత్తుగా ఓడిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. ‘టెక్నాలజీ అంటే నేనే గుర్తుకు వస్తా. మేము తీసుకున్న నిర్ణయాల వల్లే టెక్నాలజీ రంగంలో తెలుగువారు రాణిస్తున్నారు. ఎవరు పొరపాటు చేసినా కరెక్ట్ చేసే బటన్ నా చేతిలో ఉంది. పార్టీ కోసం పని చేసే వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది. ప్రజల కష్టసుఖాల్లో కార్యకర్తలు పాలుపంచుకోవాలి. నెల్లూరులో బ్రహ్మాండమైన టౌన్‌షిప్ ఏర్పాటు చేశాం. జగన్‌కు సెల్ఫీ ఛాలెంజ్ చేశా. 2 లక్షలకు పైగా ఇళ్లు పూర్తైనా ఎందుకివ్వలేదో జగన్ చెప్పాలి.’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చిన తాము సిధ్దం
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ మైండ్ బ్లాక్ అయ్యి ఇప్పుడు ఎమ్మెల్యేలను గౌరవిస్తా అంటున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. ‘పట్టభద్రుల ఎన్నికల్లో తిరుగుబాటు.....వచ్చే ఎన్నికల్లో ప్రజా తిరుగుబాటు అవుతుంది. మేం 175 పోటీ చేస్తామా లేదా అనేది మీకు ఎందుకు చెప్పాలి. మేం 175లో వైసీపీని ఓడిస్తాం. పులివెందులలో కూడా జగన్‌ను ఓడిస్తాం. అచ్చెన్నాయుడితో మొదలు పెట్టి అందరిపై తప్పుడు కేసులు పెట్టారు. ఎన్ని కేసులు పెట్టినా క్యాడర్, లీడర్లు భయపడలేదు. మా పోరాటం ఆగదు.’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఒక గెలుపు ఉత్సాహాన్ని ఇస్తుందని.. ఓటమి కుంగదీస్తుందన్నారు. ఇప్పుడు కడపలో కూడా గెలిచామని సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఒక దెబ్బకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భయపడిపోయి మీటింగ్ పెట్టారని ఎద్దేవా చేశారు. ఇంతకు ముందు ఎమ్మెల్యేలను జగన్ బానిసలుగా చూశారని ఆరోపించారు. ఇప్పుడు ఎవరినీ తీయనని ఎమ్మెల్యేలను బతిమాలుతున్నారని సెటైర్లు వేశారు. దేవుడు స్క్రిప్ట్ తిరగరాశారని, అందుకే తమకు తిరిగి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 23 మందిని తిరిగి ఇచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు.