సామాజిక న్యాయాన్ని బస్సుయాత్రలో ఎలుగెత్తి చాటాలి: YS Jagan Mohan Reddy

by Seetharam |   ( Updated:2023-10-26 12:45:28.0  )
YS Jagan
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రపై పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ట్విటర్ వేదికగా స్పందించారు. ఈ నాలుగేళ్లలో జరిగిన సామాజిక న్యాయాన్ని బస్సు యాత్రలో ఎలుగెత్తి చాటాలని, తద్వారా రాబోయే రోజుల్లో పెత్తందారులతో జరిగే యుద్ధంలో పేదవాడి విజయానికి బాటలు వేయాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. మన ప్రభుత్వంలో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలకు కల్పించిన ప్రాధాన్యత ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశచరిత్రలోకూడా మునుపెన్నడూ చూడనిది అని చెప్పుకొచ్చారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ప్రగతిని ఒక హక్కుగా మన ప్రభుత్వం వారికి అందించింది అని చెప్పుకొచ్చారు. గత 53 నెలల కాలంలో రూ. 2.38 లక్షల కోట్ల డీబీటీలో 75శాతం ఈ వర్గాలకు చేరడమే దీనికి నిదర్శనం అని సీఎం వైఎస్ జగన్‌ తన ట్వీట్‌లో ప్రస్తావించారు.

Advertisement

Next Story