- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఢిల్లీలో సంచలన పరిణామం.. మంత్రి లోకేష్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ?

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) నిన్న(మంగళవారం) ఢిల్లీ(Delhi)లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(Prashanth Kishor)తో ప్రత్యేకంగా సమావేశమయ్యరనే ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలోని సీఎం నివాసం 1-జన్‌పథ్‌లో దాదాపు గంట పాటు ఈ భేటీ జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో ఏపీ, బీహార్, దేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, తెలంగాణలో టీడీపీ బలోపేతంపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం. ఐప్యాక్ నుంచి బయటికొచ్చిన ప్రశాంత్ బిహార్‌లో ‘జన్ సురాజ్’ పార్టీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
అయితే మంత్రి లోకేష్, ప్రశాంత్ కిషోర్ భేటీకి సంబంధించిన వివరాలపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం లేదు. ఏపీలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో(assembly Elections) కూడా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు(CM Chandrababu), నారా లోకేష్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఢిల్లీ రైల్వే భవన్(Delhi Railvy Bhavan)లో మంత్రి నారా లోకేష్ రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్(Aswini Vaishnav)ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో రైల్వే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్‌కి అత్యధికంగా కేటాయింపులు చేసినందుకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను మంగళగిరి(Mangalagiri) చేనేత శాలువాతో సత్కరించారు.
అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ఏపీలో ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల పై వివరించారు. ఇటీవల కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ కోరారు. ఏఐతో వస్తున్న అవకాశాలు అందిపుచ్చుకుంటూ డేటా సిటీల ఏర్పాటుకు అవసరమైన ప్రత్యేక పాలసీల రూపకల్పన, సింగిల్ విండో పద్ధతిలో కేంద్రం నుంచి అనుమతులు సులభతరం చేయాలని కోరారు. మంగళగిరిలో ఎన్నో ఏళ్లుగా 800 నిరుపేద కుటుంబాలు నిరుపయోగంగా ఉన్న రైల్వే భూముల్లో నివసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మానవతా దృక్పథంతో ఆ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. అక్కడ నివసిస్తున్న పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు అందజేస్తామని చెప్పారు.