‘నా పిల్లలు రెండ్రోజులుగా ఏం తినలేదు.. ఎలాగైనా మీ డబ్బులు మీకిచ్చేస్తా’

by Gantepaka Srikanth |
‘నా పిల్లలు రెండ్రోజులుగా ఏం తినలేదు.. ఎలాగైనా మీ డబ్బులు మీకిచ్చేస్తా’
X

దిశ, వెబ్‌డెస్క్: పల్నాడు(Palnadu) జిల్లా దాచేపల్లి సచివాయం(Dachepalli Secretariat)లో పనిచేస్తున్న ఉద్యోగి లక్ష్మీప్రసాద్ పెన్షన్‌ డబ్బు(Pension Money)లతో పరారైన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. మార్చి 1వ తేదీన పంపిణీ చేయాల్సిన రూ.11.5 లక్షల డబ్బుతో జంప్ అయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు అతడిపై కేసు నమోదు చేసి విస్తృతంగా గాలిస్తున్నారు. ఇక తప్పించుకోలేనని భావించిన లక్ష్మీప్రసాద్ తాజాగా సెల్ఫీ వీడియో(Selfie Video) విడుదల చేశాడు.

‘నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నెలరోజులలో డబ్బులు చెల్లిస్తాను. ఆన్ లైన్ బెట్టింగులతో మోసపోయాను. నా కుటుంబం, పిల్లలు రెండు రోజులుగా ఏమీ తినలేదు. కలెక్టర్, దాచేపల్లి కమిషనర్ నన్ను క్షమించండి. నా తల్లిదండ్రులను బతిమిలాడైనా డబ్బులు తీసుకొస్తాను’ అని పెన్షన్ డబ్బులతో పరారైన లక్ష్మీప్రసాద్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు.

Next Story

Most Viewed