Tirumala : తిరుమలలో నడక మార్గంలో భద్రతా ఆంక్షలు !

by Y. Venkata Narasimha Reddy |
Tirumala : తిరుమలలో నడక మార్గంలో భద్రతా ఆంక్షలు !
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుపతి, తిరుమల(Tirumala) పరిధిలో చిరుత(Leopard)ల సంచారం నేపథ్యంలో టీటీడీ(TTD) విజిలెన్స్ అధికారులు పటిష్ఠ భద్రతా చర్యలు(Security Measures) చేపట్టారు. విజిలెన్స్ సిబ్బంది గస్తీని ముమ్మరం చేశారు. అలిపిరి నుంచి తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తులను ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు యధావిధిగా అనుమతిస్తున్నారు. అనంతరం గుంపులుగా వదులుతున్నారు. ఒక్కో బృందంలో 70 నుంచి 100 మంది ఉండేలా విజిలెన్స్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. 12 సంవత్సరాలలోపు ఉన్న చిన్నారులను మధ్యాహ్నం నుంచి అనుమతించడం లేదు.

రాత్రి 9.30 గంటల తరువాత అలిపిరి నడక మార్గాన్ని మూసివేస్తున్నారు. గతంలో తిరుమల మెట్ల మార్గంలో సమీపంలో గతంలో చిరుత దాడిలో ఓ బాలిక మృత్యువాత పడటం..మరికొందరి భక్తులపై కూడా చిరుతలు దాడి చేశాయి. దాడి చేసిన చిరుతలను బంధించి ఇతర ప్రాంత అడవులకు తరలించారు. అయితే తాజాగా మరోసారి తిరుమల మెట్ల మార్గంలోని 7వ మలుపు వద్ధ ఓ చిరుత కనిపించడంతో భక్తులు హడలిపోతున్నారు.

గురువారం రాత్రి అలిపిరి నడక మార్గంలోని ముగ్గుబావి సమీపంలో చిరుత సంచారాన్ని భక్తులు గుర్తించారు. వెంటనే అటవీశాఖ సిబ్బంది అప్రమత్తమై పెద్దపెద్ద శబ్దాలు చేయడంతో చిరుత అడవిలోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో మరోసారి తిరుమల నడక మార్గంలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు.



Next Story

Most Viewed