AP News:వాలంటీర్ వ్యవస్థ పై RRR కీలక వ్యాఖ్యలు!

by Jakkula Mamatha |
AP News:వాలంటీర్ వ్యవస్థ పై RRR కీలక వ్యాఖ్యలు!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వలంటీర్ వ్యవస్థను నూతనంగా అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందా? లేదా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల సీఎం చంద్రబాబు వలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వలంటీర్ల సేవలను సమర్ధవంతంగా వినియోగించుకునేలా అధికారులకు సీఎం సూచలనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వలంటీర్ వ్యవస్థపై ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వలంటీర్ వ్యవస్థను ఒక పార్టీ కోసం పనిచేసే వ్యవస్థగా స్థాపించారు. ప్రజెంట్ వలంటీర్లను కొనసాగించాలని అభ్యర్థనలు వస్తున్నాయి. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను. వలంటీర్లు లేనంత మాత్రాన ప్రజలకు ఉన్న కంఫర్ట్స్ పోలేదు. దీనిపై ఇంతకంటే మాట్లాడను’ అని RRR పేర్కొన్నారు. అలాగే వలంటీర్లకు న్యాయం చేకూరే విధంగా కూటమి సర్కార్ ఆలోచనలు చేస్తుందన్నారు.

Advertisement

Next Story